- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పాట్నాలో విపక్షాల సమావేశం..వచ్చే లోక్ సభ ఎన్నికలకు వ్యూహం ఖరారు
న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వచ్చే నెల 12వ తేదీన పాట్నాలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది సన్నాహక సమావేశేమేనని, 18 పార్టీలు పాల్గొనే అవకాశం ఉందని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. కొంత కాలం తర్వాత విపక్షాల ప్రధాన సమావేశం నిర్వహిస్తామన్నారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడంలో 20 ప్రతిపక్ష పార్టీలు ఐక్యతను పాటించడం సంతోషకరమని చెప్పారు.
విపక్షాలను ఏకం చేస్తున్న నితీశ్ కుమార్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్షాలను ఏకం చేసే పనిని బీహార్ సీఎం నితీశ్ కుమార్ భుజాన ఎత్తుకున్నారు. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గేను, రాహుల్ గాంధీని కలిశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులతోనూ సమావేశమయ్యారు.