ఒడిశా రైలు ప్రమాదం.. కేవలం 51 గంటల్లో రైలు సేవలు పునఃప్రారంభం (వీడియో)

by Disha Web Desk 12 |
ఒడిశా రైలు ప్రమాదం.. కేవలం 51 గంటల్లో రైలు సేవలు పునఃప్రారంభం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 2 రాత్రి 7 గంటల సమయంలో ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 280 మంది మృతి చెందగా..మరో 100 మంది ప్రయాణికుల వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ భారీ ప్రమాదం వల్ల దేశవ్యాప్తంగా రైలు వ్యవస్థనే దాదాపు స్తంబించిపోయింది. ముఖ్యంగా ఒడిశా మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లు రద్దు చేయబడ్డాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ సమస్యను చాలెంజింగ్‌గా తీసుకున్న రైల్వే మినిస్టర్.. ప్రమాదం జరిగినప్పటి నుంచి క్షతగాత్రులను బయటకు తీసి.. పాడైపోయిన రెండు ట్రాక్‌లను పునరుద్దరించే వరకు దాదాపు 51 గంటల వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు.

దాదాపు 1000 మంది కార్మీకుల తీవ్ర శ్రమ కారణంగా 51 గంటల్లోనే ఈ ట్రాక్ పునరుద్దరణ చేయగలిగామని.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం రాత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మేము త్వరలో రైలు సేవలు పునః ప్రారంభిస్తాము. అలాగే.. ప్రయాణీకుల కుటుంబ సభ్యులందరినీ సంప్రదించే వరకు లేదా వారి గురించి సమాచారం పొందే వరకు మా బాధ్యత ముగియదు అని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.. బాలాసోర్‌లో ప్రమాదం జరిగిన సెక్షన్‌లోని మొదటి రైలు ఆదివారం రాత్రి 10.40 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించిందని అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed