రాజకీయ లబ్ది కోసం మూడో టర్మ్ అధికారం కోరుకోవడం లేదు: మోడీ

by Dishanational1 |
రాజకీయ లబ్ది కోసం మూడో టర్మ్ అధికారం కోరుకోవడం లేదు: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు, ఓటర్ల విశ్వాసాన్ని పొందేందుకు రాబోయే 100 రోజులు కొత్త ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. ఆదివారం జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొన్న మోడీ, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు పెద్ద కలలు కనాలని, అతిపెద్ద తీర్మానాలను చేయాల్సి ఉంటుందన్నారు. 'రాబోయే ఐదేళ్లు ఎంతో కీలకం.. మన వికసిత భారత్ కోసం ఎంతో కృషి చేయాలి. దీనికోసం బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని' మోడీ తెలిపారు. కోట్లాది మంది మహిళలు, పేదలు, యువకుల కలలనే మోదీ కూడా కంటున్నారు. దేశాన్ని భారీ కుంభకోణాలు, ఉగ్రవాద దాడుల నుంచి విముక్తి చేశాం. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేశామన్నారు. 'తాను మూడో టర్మ్‌ను అధికారం ఆస్వాదించడానికి కోరుకోవడం లేదు. దేశం కోసం పనిచేయడానికి ప్రయత్నిస్తున్నానని' మోడీ పేర్కొన్నారు. తాను నా గురించే ఆలోచించి ఉంటే కోట్లాది మందికి ఇళ్లు కట్టించే అవకాశం ఉండేది కాదన్నారు.

10 ఏళ్లు కళంకం లేని పాలన, 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడం సాధారణ విజయాలు కాదన్నారు. నవభారత నిర్మాణం కోసం ప్రతి క్షణం పనిచేద్దామని, వచ్చే ఎన్నికల్లో 370 సీట్లను గెలవడమే లక్ష్యంగా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు మోడీ పిలుపునిచ్చారు. భారత అభివృద్ధిని ప్రపంచం గుర్తించింది. దేశం కోసం మనం చేయాల్సింది చాలా ఉందని మోడీ పేర్కొన్నారు.


Next Story

Most Viewed