యూపీ మ‌ద‌ర్సాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

by Dishanational1 |
యూపీ మ‌ద‌ర్సాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు భారత అత్యున్నత న్యాయస్థానం భారీ ఉపశమనం కల్పించింది. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా విద్యా చట్టం-2004ను రద్దు చేస్తూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని 16,000 మదర్సాలు మునుపటి లాగే పనిచేయనున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయం ప్రాథమికంగా సరికాదని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయంపై ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై యూపీ ప్రభుత్వం నుంచి వివరణ కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. సెక్యులరిజం సూత్రాన్ని ఊలంఘించిన కారణంగా 2004 నాటి మదర్సా విద్యా చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు గత నెలలో తీర్పు ఇచ్చింది. మదర్సా విద్యార్థులకు అధికారిక విద్యా విధానానికి మ‌ళ్లించే ప‌థకాన్ని రూపొందించాల‌ని జ‌స్టిస్ వివేక్ చౌదరి, జ‌స్టిస్ సుభాష్ విద్యార్ధితో కూడిన ధ‌ర్మాస‌నం యూపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే, మదర్సా బోర్డు లక్ష్యాలు నియంత్రణ స్వభావం కలిగి ఉన్నాయని, మదర్సా బోర్డు ఏర్పాటు సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు పేర్కొంది.



Next Story

Most Viewed