హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులు అరెస్ట్

by Disha Web Desk 12 |
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశామని, హత్య, భారతదేశంతో సంబంధాలపై చురుకైన దర్యాప్తు జరుగుతోందని కెనడా పోలీసులు తెలిపారు. కాగా హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణానికి భారతీయ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్న కెనడా తాజాగా ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశామని తెలపడంతో వివాదం తీవ్రతరంగా మారుతుంది. ఈ కేసులో కెనడా అరెస్ట్ చేసిన వారిలో కరణ్‌ప్రీత్ సింగ్ (28), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22) గా గుర్తించారు.

Next Story

Most Viewed