- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nipah: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. ఓ మహిళకు పాజిటివ్
కేరళలో మరోసారి నిఫా వైరల్ కలకలం రేపింది. మలప్పురం జిల్లాలోని వాలంచెరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నిఫా వైరస్ పాజిటివ్ గా తేలింది.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ (Kerala) లో మరోసారి నిఫా వైరస్ (Nipah virus) కలకలం రేపింది. మలప్పురం (Malappuram) జిల్లాలోని వాలంచెరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నిఫా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (veena George) తెలిపారు. మహిళ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోందని, అంతేగాక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. అనుమానం వచ్చిన వైద్యులు ఆమె నమూనాలకు పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా నిఫా వైరస్ గా నిర్ధారించారు. వైరస్ వెలుగు చూడటంతో స్థానిక ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
దీంతో మలప్పురంలో నిపా వైరస్ సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. గతంలో ఇదే జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ గా తేలింది. బాధిత మహిళ ఇంట్లోని మరో ఇద్దరు కుటుంబ సభ్యుల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపించడం ప్రారంభించాయని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే మహిళ చికిత్సకు స్పందించడం లేదని పలు కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మహిళతో టచ్ లో ఉన్న వారి నమూనాలను సేకరిస్తోంది.






