'తండ్రి బాధ్యతల్లో సూపర్ హీరోలు'.. క్యాబ్ డ్రైవర్ పాప కోసం ఓ సీఈవో చేసిన పనికి నెటిజన్లు ఫిదా

by Disha Web Desk 13 |
తండ్రి బాధ్యతల్లో సూపర్ హీరోలు.. క్యాబ్ డ్రైవర్ పాప కోసం ఓ సీఈవో చేసిన పనికి నెటిజన్లు ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎవరు ఎలా పోతే నాకేంటి అనుకునే బిజీ లైఫ్ స్టైల్ లో అక్కడక్కడా మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపించే సంఘటనలో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ కుమార్తె కోసం ఓ సీఈవో చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరు చేసిన పనికి హ్యాట్సాప్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చేంజ్ విత్ వన్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ సీఈవో కిరణ్ వర్మ ఇటీవల తాను ఎదుర్కొన్న ఓ ఘటనను ఫేస్స బుక్ వాల్ పై రాసుకొచ్చారు.

‘ఇటీవల తాను ఉబేర్ క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. నన్ను పిక్ చేసుకునేందుకు వచ్చిన డ్రైవర్ రైడ్ ను స్టార్ట్ చేశాడు. డ్రైవింగ్ చేస్తుండగా అతడికి వరుసపెట్టి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే వాటిని అతను కట్ చేస్తున్నాడు. గమనించిన నేను కాల్ మాట్లాడమని చెప్పాను. దాంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు నుంచి అతని కుమార్తె స్కూల్ బ్యాగ్ తీసుకురావాలని అడుగుతోంది. ఆ విషయాన్ని పట్టించుకోనట్లుగా ఆ డ్రైవర్ ఫోన్ ను తన భార్యకు ఇవ్వమని కోరాడు. కోంచెం డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యే పాప కోసం పుస్తకాలు కొన్నాను. అలాగే నెలఖర్చులు ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల వరకు బ్యాగ్ ను కొనలేనని చెప్పాడు. అయితే అతను తన భార్యతో మాట్లాడుతుండగా నేను డ్రాప్ లొకేషన్ మార్చాను. అక్కడికి చేరుకోగానే కొనబోయే వస్తువు చాలా బరువుగా ఉందని నాతో రమ్మని డ్రైవర్ ను అడిగాను. అందుకు ఆ డ్రైవర్ మరో మాట అడగకుండా నాతోపాటు వచ్చాడు.

నేను అతడిని ఓ బ్యాగ్ దుకాణానికి తీసుకువెళ్లి ఒక స్కూల్ బ్యాగ్ కొని అతడి చేతిలో పెట్టాను. కృతజ్ఞతా భావంతో మౌనంగా ఉన్న ఆ డ్రైవర్ తో “ఈ రోజు మీ పాపకు సర్ప్రైజ్ ఇవ్వండి” అని చెప్పారు. నా నెంబర్ తీసుకున్న అతను ఓ గంట తర్వాత బ్యాగ్ పట్టుకుని దేవదూతలా నవ్వుతున్న తన కుమార్తె ఫోటోను నాకు పంపాడు. ఈ ఫోటో డబ్బుతో కొనగలిగే దానికంటే ఎంతో విలువైనది. మేము తరచుగా క్యాబ్ బుక్ చేసుకుంటాం. వాటిలో అనేక మంది చెడు డ్రైవర్లను చూస్తాం. కానీ కొన్ని సార్లు తండ్రి బాధ్యతలను పోషించే సూపర్ హీరోలు కూడా ఉంటారు. తమ పిల్లలను ఎప్పుడూ నిరాశపరచని ప్రతి తండ్రికి కృతజ్ఞతలు. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో వారు కాలం గడుపుతున్నారు. ఇతరుల పట్ల దయతో ఉండండి. అవసరమైన ఎవరికైనా సహాయం చేయండి. ప్రపంచం అందంగా కనిపిస్తుంది. అంటూ రాసుకొచ్చారు.

ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. మీరు చేసిన పని నిజంగా గ్రేడ్ జాబ్, ఇతురలుకు స్పూర్తిదాయకంగా ఉంది. మనసులో చాలా ధనవంతులు అంటూ కామెంట్స్ రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు.



Next Story

Most Viewed