దేశానికి అపూర్వమైన ఇంధన రంగ అవకాశాలు: ప్రధాని మోడీ

by Disha Web Desk 17 |
దేశానికి అపూర్వమైన ఇంధన రంగ అవకాశాలు: ప్రధాని మోడీ
X

బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన రంగానికి భారత్‌కు అపూర్వమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ దేశానికి కొత్త దిశను ఇచ్చిందని చెప్పారు. కర్ణాటక బెంగుళూరులో సోమవారం ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి మా ఎనర్జీ మిక్స్ సహజ వాయువు వినియోగాన్ని పెంచడానికి మేము వేగవంతంగా పని చేస్తున్నామని తెలిపారు.

సాంకేతికత, ప్రతిభ, ఆవిష్కరణల శక్తితో బెంగళూరు అభివృద్ధి చెందిందని కొనియాడారు. 'ఇంధన రంగ అభివృద్ధి రంగంలో భారత్‌కు అసమానమైన అవకాశాలు ఉన్నాయి. ఇంధన వనరుల అభివృద్ధి, శక్తి పరివర్తన ప్రక్రియలకు సంబంధించి భారతదేశం ఉన్నతంగా ఉంది. ఇది నిజంగా 21వ శతాబ్దంలో దేశానికి గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది' అని ప్రధాని చెప్పారు.

కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడటమే కాకుండా, 2022లో అంతర్జాతీయ వేదికపై సత్తా చూపించిందని తెలిపారు. ప్రస్తుతం కోట్ల మంది పేదరికం నుంచి మధ్య తరగతిలోకి వచ్చారని, నాణ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు.

దేశం సామర్థ్యం వెనుక అనేక అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు. మొదటిది 'స్థిరమైన నిర్ణయాత్మక ప్రభుత్వం', రెండవది 'సుస్థిర సంస్కరణలు', మూడవది 'అట్టడుగు స్థాయిలో సామాజిక-ఆర్థిక సాధికారత' అని చెప్పారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ రూపొందించిన సోలార్ కుకింగ్ సిస్టమ్‌కు చెందిన ట్విన్ కుక్ టాప్ మోడల్‌ను ఆయన ఆవిష్కరించారు.


Next Story

Most Viewed