పీఎం-కిసాన్ సాయం రూ.8,000-12,000 పెంపుపై కీలక ప్రకటన

by Disha Web Desk 17 |
పీఎం-కిసాన్ సాయం రూ.8,000-12,000 పెంపుపై కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పీఎం-కిసాన్ పథకం కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచునున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా కీలక ప్రకటన చేశారు. పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని ఏడాదికి రూ.8,000-12,000కు పెంచే ప్రతిపాదన లేదని మంత్రి లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అలాగే, ఈ పథకం కింద మహిళా రైతులకు కూడా పెంచే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆయన అన్నారు.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)ని కేంద్రం 2019లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏడాది రూ.6000 అందిస్తారు. వీటిని విడతల వారీగా ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తారు.

మంత్రి లోక్‌సభలో పేర్కొన్న దాని ప్రకారం ,ప్రభుత్వం ఇప్పటివరకు 15 విడతలుగా 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే, ప్రపంచంలోని అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాల్లో ఇది ఒకటని, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నట్లు మంత్రి అన్నారు.

Next Story

Most Viewed