మేఘాలయాను ఢిల్లీ నుంచి పాలిస్తున్నారు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

by Dishanational2 |
మేఘాలయాను ఢిల్లీ నుంచి పాలిస్తున్నారు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మేఘాలయాను రాష్ట్రం నుంచి కాకుండా ఢిల్లీ నుంచి పరిపాలిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సోమవారం సాయంత్రం అసోం నుంచి మేఘాలయాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రి భోయ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. మేఘాలయాలో గత ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైందని చెప్పిన అమిత్ షా ఎన్నికల అనంతరం తిరిగి అదే ప్రభుత్వంలో భాగమయ్యారని ఎద్దేవా చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లపైనా రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెగల అంతర్యుద్ధం కారణంగా మణిపూర్‌లో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల మంది ప్రాణాలు కొల్పోయారు. ఇంతా జరుగుతున్న ప్రధాని మోడీ మౌనంగా ఉంటడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను పరిష్కరిచండంలో బీజేపీ ఫెయిలైంది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని వెల్లడించారు.

తిరిగి అసోంలోకి యాత్ర: మరోసారి షరతులు విధించిన ప్రభుత్వం

సోమవారం అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాత్ర కొనసాగించిన రాహుల్ మేఘాలయాకు చేరుకున్నారు. అయితే తిరిగి మంగళవారం యాత్ర మళ్లీ అసోంలోకి ప్రవేశించనుంది. దీంతో గువహటి లోని ఆర్టీరియల్ రోడ్ల గుండా వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. గువహటిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని భావించిన అధికారులు 27వ జాతీయ రహదారిపై యాత్ర చేపట్టాలని కోరారు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్ జోడో న్యాయ్ యాత్రకు హిమంత బిస్వశర్మ ప్రభుత్వం పదే పదే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ‘అసోంలో యాత్ర ప్రవేశించినప్పటి నుంచి, భారతదేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి తన గూండాలను ఉపయోగించి కాంగ్రెస్ కు చెందిన వాహనాలు, నాయకులపై దాడులు చేయిస్తుంది’ అని మండిపడింది.


Next Story

Most Viewed