Meerut Murder: మీరట్ మర్డర్ కేసులో ట్విస్ట్..!

by Shamantha N |   (  Updated:2025-04-07 15:03:41  IST  )

మీరట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పూత్ హత్య కేసులో ఆయన భార్య ముస్కాన్ రస్తోగి పోలీసుల అదుపులో ఉంది.

Meerut Murder: మీరట్ మర్డర్ కేసులో ట్విస్ట్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మీరట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పూత్ హత్య కేసులో ఆయన భార్య ముస్కాన్ రస్తోగి పోలీసుల అదుపులో ఉంది. కాగా.. జైలులో ఉన్న ముస్కాన్ ప్రెగ్నెంట్ గా ఉందని అధికారులు తెలిపారు. జైలు అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా ఆస్పత్రి నుంచి ఒక టీమ్ సోమవారం జైలులో ఆమెకు పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో ముస్కాన్ రస్తోగి గర్భవతి అని తేలింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా ముస్కాన్ ప్రెగ్నెన్సీని ధ్రువీకరించారు. ఇకపోతే, ఈ కేసులో నిందితులిద్దరు ముస్కాన్, సాహిల్ మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మీరట్ మర్డర్ కేసు

గత నెలలో మీరట్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ఉన్న సౌరభ్ రాజ్‌పూత్(29) తన కుమార్తె పుట్టిన రోజు కోసం భారత్ వచ్చిన సమయంలో, అతడి భార్య ముస్తాన్ రస్తోగి(27), ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా(25) కలిసి దారుణంగా హత్య చేశారు. మార్చి 4న హత్య జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌరభ్ ని కత్తితో పొడిచి, గొంతు కోసి హతమార్చారు. ఆ తర్వాత డెడ్ బాడీని 15 ముక్కలుగా చేసి డ్రమ్‌లో పెట్టి, సిమెంట్‌తో కప్పేశారు. హత్య తర్వాత ముస్తాన్, సాహిల్ కలిసి ట్రిప్ కు వెళ్లారు. అయితే, సౌరభ్ కనిపించడం లేదని అతడి కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లుగా ఐదేళ్ల కుమార్తెతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. సౌరభ్ లండన్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముస్కాన్‌, సాహిల్ మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. డ్రగ్స్‌కి బానిసైన ఇద్దరు సౌరభ్‌ని అడ్డు తొలగించుకోవడానికి ఈ దారుణానికి ఒడిగట్టారు.

Read More..

Karnataka: రోడ్డుపై మహిళపై లైంగిక వేధింపులు.. హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Next Story