శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్ అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర సీఎం

by Disha Web Desk 9 |
శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్ అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలో ఎన్నికల జోరు నడుస్తోంది. ఆయా పార్టీలన్నీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్ని మచ్చిక చేసుకునే పనిలో బిజీ అయిపోయారు. ఇకపోతే బీజేపీ, ప్రధానమంత్రి మోడీపై వెస్ట్ బెంగాల్ సీఎం కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటారు. ఇకపోతే శ్రీరామనవమి ఉత్సవాలు ఆపేందుకు తృణముల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది రామనవమి ఊరేగింపుల్లో హింసపై బీజేపీ-తృణముల్ పార్టీ పరస్పరం తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నాయి. ఈ సారి తృణముల్ ఎన్ని కుట్రలు పన్నినా, కోర్టు నుంచి అనుమతి పొంది మరీ భక్తి, విశ్వాసంతో శ్రీరామనవమి జరుపుకుంటామని కలకత్తాను ఉద్ధశించి ప్రధాని మోడీ ప్రకటించారు. కలకత్తా హైకోర్టు విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనలను రామమనవమి ఊరేగింపులను అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వీరి పిటిషన్‌ను విచారించిన ధర్మాసం శ్రీరామనవమి శోభాయాత్రలకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో బీజేపీపై శ్రీరామనవమి శోభయాత్రపై మమతా బెనర్జీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మైనార్టీ సోదర సోదరీమణులు.. ఏప్రిల్ 17 న నినాదాలు చేయడం చేస్తే.. అది వారి అల్లర్లు ప్రారంభించే రోజు అవుతుందన్నారు. బీజేపీ వాళ్లు దూషించిన సరే. అల్లాహ్ అని ప్రార్థించడని పిలుపినిచ్చారు. ఎలాంటి ప్రేరణలకు లొంగద్దని చెప్పారు. శాంతి భద్రలను కాపాడటమే ముఖ్యమన్నారు. అల్లర్లు సృష్టించి ఎన్‌ఐఎ కు పంపాలని చూస్తున్నారని, దీంతో ఓటింగ్ జరగదని, ఓట్లను రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మమతా బెనర్జీ వెల్లడించారు.


Next Story

Most Viewed