మహారాష్ట్రలో ప్రతిపక్షాల మధ్య సీట్ల ఒప్పందం.. ఉద్ధవ్ వర్గానికే 21 సీట్లు..!

by Dishanational6 |
మహారాష్ట్రలో ప్రతిపక్షాల మధ్య సీట్ల ఒప్పందం.. ఉద్ధవ్ వర్గానికే 21 సీట్లు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ మధ్య ఎట్టకేలకు సీట్ల ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ సీట్లు ఉన్న విషయం తెల్సిందే. ఇక కాంగ్రెస్ పార్టీ 15, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ లు కన్పిస్తున్నాయి. ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇకపోతే సీట్ల పంపకం విషయంలో పూర్తిస్థాయిలో ఒప్పందం కుదిరిందా లేదా అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఎంవీఏ తుది సీట్ల పంపకం ఫార్ములాపై కూటమి సీనియర్ నేతలు అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, అభ్యర్థుల ఖరారుపై మార్చి 4న ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ఏప్రిల్-మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Next Story

Most Viewed