- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ సారి వీడియో కాల్ చేయండి సార్.. డిప్యూటీ సీఎంతో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ సంభాషణ లీక్
మహారాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ పొలిటికల్ చిచ్చుగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: లేడీ ఐపీఎస్ అధికారిణిపై మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విధుల్లో ఉన్న అధికారిణికి ఫోన్ చేసి అడ్డుకోవడమే కాకుండా నేను నిజంగానే డిప్యూటీ సీఎంతో మాట్లాడుతున్నానా అని అడిగిన పాపానికి సదరు ఆఫీసర్ పై చిందులు తొక్కిన తీరు విమర్శలకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో రచ్చగా మారింది. ఇంతకీ ఏం జరగిందింటే.. సోలాపూర్ లోని కుర్దూ గ్రామంలో అక్రమమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణకు (IPS Anjana Krishna) ఫిర్యాదులు అందాయి. దీంతో రెండు రోజుల క్రితం ఆమె తన సిబ్బందితో కలికి చర్యలు తీసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. దీంతో అందులో ఒకరు నేరుగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఫోన్ ను సదరు అధికారిణికి ఇవ్వాలని అజిత్ సూచించగా అప్పడు అంజనా కృష్ణ ఫోన్ లో మాట్లాడారు.
నేను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ను మాట్లాడుతున్నాను. మీ చర్యలు ఆపి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం వాయిస్ గుర్తుపట్టని అంజనా ఫోన్ లో నేను మాట్లాడుతున్నదని నిజంగానే డిప్యూటీ సీఎంతోనేనా? ఈ విషయం తెలియాలంటే నా నంబర్ కు ఓసారి వీడియో కాల్ చేయండి అని కోరారు. ఆమె మాటలకు ఆగ్రహించిన అజిత్ పవార్ నీకెంత ధైర్యం నన్నే వీడియో కాల్ చేయమంటారా నేను మీ పై చర్యలు తీసుకుంటా.. అని చిర్రుబుర్రులాడారు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇప్పుడది వైరల్ గా మారింది. దీంతో పవరా తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోపై రాజకీయ విమర్శలు రావడంతో అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ స్టేట్ చీఫ్ సునీల్ తట్కరీ స్పందించారు. పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థ చేసుకున్నారని కార్యకర్తలను శాంతిపజేసేందుకే ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చని వివరణ ఇచ్చారు. అయితే ఆలోపే జరగాల్సిన డ్యామేజ్ భారీగా జరిగిపోయింది. ఇసుక అక్రమార్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏకంగా డిప్యూటీ సీఎం అధికారులను బెదిరించడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఎవరీ అంజనా కృష్ణ?:
అజిత్ పవార్ ఇష్యూతే ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ప్రస్తుతం షోలాపూర్ జిల్లా కర్మాలా డీఎస్పీగా పని చేస్తున్నారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఆణె 2022 ఐపీఎస్ కు బ్యాచ్ కు చెందిన అధికారిణి. కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆమె తండ్రి ఓ వస్త్ర వ్యాపారం నిర్వహిస్తుండగా తల్లి స్థానిక కోర్టులో టైపిస్ట్ గా పని చేస్తున్నారు. నీరంకరలోని ఎన్‌ఎస్‌ఎస్ కళాశాలలో గణితంలో బి.ఎస్సీ చదివే ముందు ఆమె తిరువనంతపురంలోని పూజప్పుర శివారులోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్‌లో చదువుకుంది. సివిల్ సర్వీసెస్‌లో చేరాలని నిశ్చయించుకున్న ఆమె యూపీఎస్‌స్సీకి సిద్ధమై ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో ప్రవేశించాలనే తన లక్ష్యాన్ని సాధించుకున్నారు.






