కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి BIG షాక్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పౌరసత్వ వివాదంలో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పౌరసత్వ వివాదంలో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆయనపై ద్వంద్వ పౌరసత్వం (బ్రిటిష్ పౌరసత్వం) ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని లక్నోలోని ఎంపీ-ఎంఎల్ఏ (MP-MLA) కోర్టు పోలీసులను ఆదేశించింది. గతంలో ఇదే పిటిషన్‌ను కింది కోర్టు తిరస్కరించగా, తాజా విచారణలో లక్నో కోర్టు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త, బీజేపీ నేత ఎస్. విగ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. రాహుల్ గాంధీ గతంలో బ్రిటన్‌లో ఒక కంపెనీని స్థాపించారని, అందులో తనను తాను 'బ్రిటిష్ పౌరుడిగా' పేర్కొన్నారని పిటిషనర్ ఆధారాలను సమర్పించారు. రాహుల్ గాంధీ విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే, ఆయన భారతీయ పౌరసత్వంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయితే.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఉండగా.. ఈ సమయంలో వచ్చిన ఈ కోర్టు తీర్పు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. రాహుల్ గాంధీ భారత పౌరుడేనని, ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని హస్తం పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు, ఈ అంశంపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. దేశ అత్యున్నత పదవుల్లో ఉండేవారు పౌరసత్వం విషయంలో అబద్ధాలు ఆడకూడదని డిమాండ్ చేస్తోంది.

Next Story