మరోసారి చెబుతున్నా వినండి!.. రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్

by Disha Web Desk 5 |
మరోసారి చెబుతున్నా వినండి!.. రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ నియోజవర్గం బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోసారి చెబుతున్నా వినండి అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. నియంత ముఖం దేశం ముందు మరోసారి బయటపడిందని, ప్రజల నాయకుడిని ఎన్నుకునే హక్కును హరించివేయడంతో బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడంలో మరో అడుగు వేశారన్నారు. మరోసారి చెబుతున్నాను - ఇది కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎన్నికలు కాదు, దేశాన్ని రక్షించే ఎన్నికలు, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికలు అని ఎక్స్ వేదికగా ప్రజలను హెచ్చరించారు.

కాగా లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పార్లమెంట్ సెగ్మెంట్ కు మొత్తం 3 నామినేషన్లు రాగా.. అందులో పత్రాలు సరిగ్గా లేని కారణంగా కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరో స్వతంత్ర అభ్యర్ధి బరిలో ఉండగా.. బీజేపీ పెద్దల అభ్యర్ధన మేరకు స్వతంత్ర అభ్యర్ధి తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. దీంతో సూరత్ లో బీజేపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నియామక పత్రం అందజేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై విధంగా స్పందించారు.

Read More...

BREAKING: పడిపోతున్న నన్ను నిలబెట్టింది మల్కాజ్‌గిరి ప్రజలే: సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ కామెంట్స్



Next Story

Most Viewed