- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంకోర్టులో సంచలనం.. చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న ఓ లాయర్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గావయ్ (Chief Justice BR Gavai)పై దాడి చేసేందుకు (Attempt to attack) యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు చూడగా.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అతడు సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్ట బోమని బిగ్గరగా కోర్టు హాలులోనే నినాదాలు చేశారు.
ఈ క్రమంలో సీజేఐ బీఆర్ గవాయ్ (CJI BR Gavai) స్పందిస్తూ ఇలాంటి దాడుల తనను ఏమీ చేయలేవని.. మిగతా లాయర్లు తమ తమ వాదనలు వినిపించాలని సీజేఐ కోరారు. కొద్ది సేపు అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ.. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఏది ఏమైనప్పటికి సుప్రీం కోర్టులో ఏకంగా చీఫ్ జస్టీస్ పై దాడికి ప్రయత్నించడం ప్రస్తుతం సంచలన పరిణామంగా మారింది. అయితే ఈ దాడి చేయడానికి పాల్పడిన లాయర్ కిషోర్ రాకేష్ ను సిబ్బంది బయటకు పంపించగా.. దాడిపై స్పందించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.






