- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kerala: కేరళ కాంగ్రెస్ యూనిట్ లో విబేధాలు.. వైరల్ గా రాహుల్ గాంధీ పోస్టు
కేరళ కాంగ్రెస్ యూనిట్ లో విభేదాల వేళ లోక్ సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ కాంగ్రెస్ యూనిట్ లో విభేదాల వేళ లోక్ సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారింది. తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు వచ్చాయన్న ఊహాగానాలకు రాహుల్ గాంధీ చెక్ పెట్టారు. “అంతా ఒకటిగా నిలిచాం”, యునైటెడ్ అని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఫిబ్రవరి 28న ఢిల్లీలో కాంగ్రెస్ నేతల భేటీ తర్వాత కేరళ కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం నుండి ఒక చిత్రాన్ని ఆయన పోస్ట్ చేశారు. “వారంతా ఐక్యంగా ఉన్నారు. భవిష్యత్ లక్ష్యం కోసం ఒక్కటిగా ఉన్నారు” అని క్యాప్షన్ ఇచ్చారు. దానికి 'టీమ్ కేరళ' అనే హ్యాష్‌ట్యాగ్ కూడా జత చేశారు.
మోడీని ప్రశంసించిన థరూర్
ఇటీవలే, ప్రధాని నరేంద్ర మోడీని థరూర్ ప్రశంసించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం లేకపోతే తనకు వేరే ఆప్షన్ ఉన్నాయని బెదిరింపులకు దిగారు. పార్టీలో తనను పక్కన పెట్టడం పట్ల థరూర్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత, రాహుల్ గాంధీ ధరూర్ లో క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో కేరళ కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అంతేకాకుండా, నేతలకు కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది.






