22న ఢిల్లీ మేయర్ ఎన్నిక

by Dishanational1 |
22న ఢిల్లీ మేయర్ ఎన్నిక
X

న్యూఢిల్లీ: మేయర్ ఎన్నిక తేదీ ఖరారైంది. ఈ నెల 22న నిర్వహించనున్నట్లు పాలక సంస్థ అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందు సీఎం కేజ్రీవాల్ కూడా 22న మేయర్ ఎన్నిక నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రతిపాదన చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'మేయర్ ఎన్నికల విషయంలో ఆప్, ఢిల్లీ ప్రజలు సుప్రీంకోర్టులో భారీ విజయం సాధించారు. ఎల్‌జీ-బీజేపీ వ్యక్తులు రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో బీజేపీని మేయర్‌ని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు దానిని విఫలం చేసింది. ఫిబ్రవరి 22న మేయర్‌ ఎన్నికలు నిర్వహించాలని ఎల్‌జీ సర్‌కి ప్రతిపాదన పంపాను' అని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

శుక్రవారం సుప్రీంకోర్టు మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని స్పష్టం చేసింది. 24 గంటల్లో మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ 22న ఎన్నిక నిర్వహించాలని ఎల్జీకి ప్రతిపాదించారు. సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనతో అధికారులు కూడా అదేరోజు ఎన్నిక చేపట్టేందుకు మొగ్గు చూపారు. బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఎల్జీ తన న్యాయవాదిని కేసులో ఇరువైపులా వాదించేందుకు ప్రయత్నించడం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. రాజ్యాంగవిరుద్ధంగా ఎల్జీ కేసులో వాస్తవాలు బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నించారని విమర్శించారు.

Next Story

Most Viewed