కంగనా తొలిరోజు ప్రచారం.. కాంగ్రెసే టార్గెట్ గా..

by Dishanational6 |
కంగనా తొలిరోజు ప్రచారం.. కాంగ్రెసే టార్గెట్ గా..
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నుంచి తనకు సీటు రాగానే.. కాంగ్రెస్ నేతలు చీప్ పాలిటిక్స్ ప్లే చేశారని మండిపడ్డారు కంగనా రనౌత్. మండి లోక్ సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి సిటీలో తొలిరోజు భారీ ర్యాలీ చేపట్టారు.బీజేపీ శ్రేణులు కంగనాకు భారీ స్వాగతం పలికారు. ఆమెపై పూలవర్షం కురిపించారు. ప్రచారంలో భాగంగానే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రసంగించారు.

తనకు బీజేపీ నుంచి సీటు రాగానే చీప్ పాలిటిక్స్ ప్లే చేశారని మండిపడ్డారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోయిందని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. శక్తికి వ్యతిరేకంగా పోరాడుతామని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు తెరలేపిందని ఆగ్రహం తెలిపారు.

ఇకపోతే కంగనా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేశారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఆ ట్వీట్ కు కంగనా కూడా ఆన్సర్ ఇచ్చారు. అయితే ఆ పోస్టు తాను చేయలేదని.. తన అకౌంట్ హ్యాక్ చేశారని సుప్రియ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈసీ సుప్రియకు నోటీసులు జారీ చేసింది. ఇకపోతే, దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న జరగగా.. చివరి విడత జూన్ 1న జరగనుంది. రిజల్ట్స్ జూన్ 4న రానున్నాయి.


Next Story

Most Viewed