ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్: హైజాక్‌కు గురైన ఓడ సేఫ్

by Dishanational2 |
ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్: హైజాక్‌కు గురైన ఓడ సేఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అరేబియా సముద్రంలో 3 నెలల క్రితం హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్ అనే నౌకను రక్షించేందుకు భారత నావికాదళం ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా దానిని విజయవంతంగా పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నౌకను రక్షించారు. మొత్తం 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోగా..నౌకలోని 17 మంది సిబ్బంది సురక్షింతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ కోల్ కతా, యుద్ధనౌక ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, P8I పెట్రోలింగ్ విమానాలు ఉపయోగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్‌ పూర్తిగా భారత నావికాదళం ఆధీనంలో ఉన్నట్టు పేర్కొంది.

ఈ నెల 15న ఆపరేషన్ చేపట్టే ముందు సముద్రపు దొంగలను లొంగిపోవాలని నేవీ కోరింది. లేకపోతే వారిపై దాడులు ప్రారంభించాలని మెరైన్ కమాండోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమాలియా సముద్రపు దొంగలు నేవీపై కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది. అనంతరం ఏ మాత్రం బెదరకుండా రెస్క్యూ కొనసాగించిన నేవీ సముద్రపు దొంగలు లొంగి పోయేలా చేసింది. కాగా, గతేడాది డిసెంబర్ 14న ఎంవీ రుయెన్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే దానిని ఇండియన్ నేవీ రక్షించడం గమనార్హం. అంతకుముందు బంగ్లదేశ్‌కు చెందిన ఓ నౌకను సైతం ఇండియన్ నేవీ రక్షించింది. భారత నావికాదళం అరేబియా సముద్రంలో జరిగిన సంఘటనలను తక్షణమే పరిష్కరించడం, వాణిజ్య నౌకలను రక్షించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది.



Next Story

Most Viewed