- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రామస్వామి..
భారత సంతతికి చెందిన మరో రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నట్లు తెలిపారు.

X
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మరో రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నట్లు తెలిపారు. వివేక్ రామస్వామి ప్రముఖ వ్యాపారవేత్త. నిక్కీ హేలీ తర్వాత ఇటువంటి ప్రకటన చేసిన భారత సంతతికి చెందిన రెండో నేత ఈయనే. హేలీ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. 'అమెరికా ఆదర్శాలను పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను.
ఈ ప్రకటన చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇది రాజకీయ ప్రకటన మాత్రమే కాదు.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న ఉద్యమం కూడా. చైనానుంచి ఎదురవుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను' అని రామస్వామి అన్నారు.
Also Read..
Next Story






