ఈ అంశాలను పాటిస్తే సూపర్ పవర్‌గా 'భారత్': యూపీ సీఎం

by Dishanational4 |
ఈ అంశాలను పాటిస్తే సూపర్ పవర్‌గా భారత్: యూపీ సీఎం
X

లక్నో: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఐదు అంశాల గురించి చెప్పారని, ఆ అంశాలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తే భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బలిదాన్ దివస్ సందర్భంగా శుక్రవారం బల్లియాలో జరిగిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..'బల్లియా క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వదని అంటుంటారు. కానీ, స్వాతంత్ర్యానంతరం దేశాభివృద్ధికి కావాల్సిన క్రమశిక్షణను బల్లియా చూపించింది. స్వాతంత్ర్య పోరాటంలో మంగళ్ పాండే నిప్పు రవ్వ రగిల్చాడు.

మహాత్మాగాంధీ క్విట్ ఇండియా నినాదం ఇచ్చినప్పుడు చిత్తూ పాండే తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు.' అని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోడీ 5 అంశాల గురించి చెప్పారని, ఆ అంశాలను దేశ ప్రజలు తప్పకుండా పాటించినట్లయితే 2047లో భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందన్నారు. 'భారత దేశ అభివృద్ధి, బానిసత్వం-వారసత్వాన్ని నిర్మూలించడం, దేశ ఐక్యత, సమగ్రతను పెంచడం వంటి అంశాలను దేశ ప్రజలు పంచ ప్రాణాలు భావించాలని కోరారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి. అప్పుడే భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుంది. ప్రపంచ దేశాలకు న్యాయకత్వం వహిస్తుంది.' అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed