కాంగ్రెస్ బ్యాంకు ఖాతా నుంచి ఐటీ శాఖ రూ. 65 కోట్ల రికవరీ

by Dishanational1 |
కాంగ్రెస్ బ్యాంకు ఖాతా నుంచి ఐటీ శాఖ రూ. 65 కోట్ల రికవరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతా నుంచి ఆదాయ పన్ను శాఖ రూ. 65 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఆదాయ ప‌న్ను శాఖ‌కు కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ. 115 కోట్ల ప‌న్ను బ‌కాయిలు చెల్లించాల్సి ఉండ‌గా ప్రస్తుతం రూ. 65 కోట్లను రికవరీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆదాయపు పన్ను శాఖ రికవరీ చర్యలపై ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ తన ఫిర్యాదులో.. బెంచ్ ముందు షెడ్యూల్ చేసిన విచారణ ఫలితాల కోసం వేచి ఉండకుండా బ్యాంకుల వద్ద ఉన్న కొంత మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ బకాయిల కింద రికవరీ చేసినట్టు పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన స్టే దరఖాస్తు వ్యవహారం పరిష్కరించే వరకు ఆదాయ పన్ను శాఖ ముందుకు వెళ్లకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో దీనిపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.


Next Story

Most Viewed