- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IIT-Kanpur: ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఐఐటీలో మరో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్ గదిలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని నోయిడాకు చెందిన అంకిత్ యాదవ్ (24) గతేడాది యూజీసీ నెట్ (Ugc net) పరీక్షలో క్వాలిఫైన అనంతరం కెమెస్ట్రీ (chemistry) విభాగంలో పరిశోధక విద్యార్థిగా జాయిన్ అయ్యారు. ఐఐటీ క్యాంపస్ లోని హాస్టల్ హెచ్-103లో ఉంటూ పరిశోధన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ సూసైడ్ నోట్‌ను సైతం గుర్తించారు. ఇష్టపూర్వకంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, గతేడాది అక్టోబర్‌లోనూ 28 ఏళ్ల పీహెచ్ డీ విద్యార్థి క్యాంపస్‌లో సూసైడ్ చేసుకున్నారు.