నైతిక విలువలతోనే సీఎం పదవికి రాజీనామా చేశా: ఉద్ధవ్ ఠాక్రే

by Disha Web Desk 12 |
నైతిక విలువలతోనే సీఎం పదవికి రాజీనామా చేశా: ఉద్ధవ్ ఠాక్రే
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర శివసేన పార్టీ, 'సీఎం పదవి వివాదంపై సుప్రీకోర్టు ఈ రోజు కీలక తీర్పును ఇచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయగా.. షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. తనకున్న ఎమ్మెల్యేల మద్దతుతో శివసేనా పార్టీ, పార్టీ గుర్తు షిండే వర్గానికి వచ్చింది. దీంతో ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసినందున అతను తిరిగి రాష్ట్ర సీఎంగా తిరిగి రాలేనని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చేసింది. కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన ఠాక్రే.. తన రాజీనామా "తప్పు" కావచ్చు, అయితే, "నైతిక కారణాలతో" తాను అలా చేశానని అన్నారు. అలాగే "ప్రస్తుత మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంకు నైతికత ఉంటే, నేను చేసినట్లు వారు రాజీనామా చేస్తారు" అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.



Next Story

Most Viewed