Woman CM: అప్పుడు షీలా దీక్షిత్.. ఇప్పుడు రేఖా గుప్తా.. హిస్టరీ రిపీట్

by Mahesh Kanagandla |

మహిళా సీఎం తర్వాత మళ్లీ మహిళనే ఆ బాధ్యతలు తీసుకుంటున్న అరుదైన సందర్భం ఇది. 1998 అక్టోబర్ 12 నుంచి 1998 డిసెంబర్ 3వ తేదీ వరకు బీజేపీ నాయకత్వం సీఎంగా సుష్మా స్వరాజ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి సీఎం బాధ్యతలను షీలా దీక్షిత్‌కు అందించింది. ఆమె 15 ఏళ్లు నిరాటంకంగా పాలన సాగించారు. ఇప్పుడు ఆప్ 12 ఏళ్లు అధికారంలో ఉండి చివరి ఐదు నెలల్లో సీఎం బాధ్యతలను అతిశీ మార్లెనాకు అప్పగించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 సీట్లల్లో 48 సీట్లు గెలిచి అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పటి షీలా దీక్షిత్ మూమెంట్‌ ఇప్పుడు రేఖా గుప్తాకు రిపీట్ అయింది.

Woman CM: అప్పుడు షీలా దీక్షిత్.. ఇప్పుడు రేఖా గుప్తా.. హిస్టరీ రిపీట్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళా సీఎం తర్వాత మళ్లీ మహిళనే ఆ బాధ్యతలు తీసుకుంటున్న అరుదైన సందర్భం ఇది. 1998 అక్టోబర్ 12 నుంచి 1998 డిసెంబర్ 3వ తేదీ వరకు బీజేపీ నాయకత్వం సీఎంగా సుష్మా స్వరాజ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి సీఎం బాధ్యతలను షీలా దీక్షిత్‌కు అందించింది. ఆమె 15 ఏళ్లు నిరాటంకంగా పాలన సాగించారు. ఇప్పుడు ఆప్ 12 ఏళ్లు అధికారంలో ఉండి చివరి ఐదు నెలల్లో సీఎం బాధ్యతలను అతిశీ మార్లెనాకు అప్పగించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 సీట్లల్లో 48 సీట్లు గెలిచి అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పటి షీలా దీక్షిత్ మూమెంట్‌ ఇప్పుడు రేఖా గుప్తాకు రిపీట్ అయింది. మరి ఇప్పుడు బీజేపీ మరో రెండు దఫాలూ అధికారంలో ఉంటుందా? లేదా? అనేది కాలం నిర్ణయించనుంది. వారి పరిపాలన నిర్ణయించనుంది.


* మరో ఆసక్తికర విషయం ఏమంటే.. ఢిల్లీలో బీజేపీ చివరి సీఎం ఒక మహిళ(సుష్మా స్వరాజ్)నే. ఇప్పుడు మళ్లీ 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని స్వీకరిస్తూ సీఎం బాధ్యతలను మళ్లీ మహిళకే బీజేపీ అప్పగించింది.

* ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న రేఖా గుప్తా హర్యానాలో జన్మించారు. అంతకు ముందటి అరవింద్ కేజ్రీవాల్, షీలా దీక్షిత్‌ల జన్మస్థలాలు కూడా హర్యానానే కావడం గమనార్హం.

* రేఖా గుప్తా కమ్యూనిటీ బనియా(వైశ్యులు). అరవింద్ కేజ్రీవాల్‌ది కూడా ఇదే కమ్యూనిటీ. షీలా దీక్షిత్ ఖాత్రా కమ్యూనిటీలో జన్మించారు. ఈ కమ్యూనిటీ క్షత్రియుల నుంచి పరిణమించిందని, వీరు వ్యాపారాలు చేసేవారని తెలుస్తున్నది.

* దేశ రాజదానిలో మహిళలు ఎక్కువ ఓట్లు వేశారు. వారి ఓటింగ్ పర్సెంటేజే ఎక్కువ. ఈ సారి ఎన్నికల్లోనూ మహిళల చుట్టే హామీలను ప్రకటించాయి పార్టీలు. చివరికి మహిళనే ఉన్నత పీఠాన్ని అధిరోహిస్తున్నారు.

* బీజేపీలో ఏకైక మహిళా సీఎంగా రేఖా గుప్తా రికార్డు తిరగరాస్తున్నారు.

* 15 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉన్నది. 6 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నది. కానీ, ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేరు.

Next Story