భర్త ముందే భార్యకు వేధింపులు.. పుణ్యక్షేత్రం వద్ద ఇదేం పాడు పని నెటిజన్ల ఫైర్

by Disha Web Desk 14 |
భర్త ముందే భార్యకు వేధింపులు.. పుణ్యక్షేత్రం వద్ద ఇదేం పాడు పని నెటిజన్ల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హోలీ పండుగ నాడు ఆయా ప్రాంతాల్లో ఆకతాయిలు రెచ్చిపోయిన సంఘటనలు సోషల్ మీడియాలో ఒక్కోక్కటిగా చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ముస్లిం ఫ్యామిలీపై ఆకతాయిలు రంగులు నీళ్లు చల్లీ వేధింపులకు గురి చేసిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన వైరల్‌గా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో మణికర్ణికా ఘాట్ వద్ద కొంత మంది ఆకతాయిలు యువ జంటను వేధింపులకు గురిచేశారు. హోలీ పండగ పూట భర్త ముందే భార్యపై రంగు నీళ్లు చల్లారు. వద్దని ఆ జంట ఎంత వారించినా కూడా ఆకతాయిలు వినలేదు.

పైగా ఆ ప్రదేశంలో చాలా మంది ఉన్నారు. వారంతా కూడా ఆ వేధింపులు ఆపకుండా.. వీడియోలు తీస్తున్నారు. దీంతో యువ జంట మరింత భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాడు జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఉత్తర ప్రదేశ్, వారణాసి పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. సంప్రదాయం పేరుతో భర్త కళ్ల ముందే భార్యను వేధించడం ఏమిటని, పుణ్యక్షేత్రం వద్ద ఇదేం పాడు పని అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


Next Story

Most Viewed