- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ పోలీసులు- వాంటెడ్ క్రిమినల్ మధ్య కాల్పులు
దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం బీహార్ పోలీసులతో కలిసి ఢిల్లీ పోలీసులు నలుగురు వాంటెడ్ క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం బీహార్ పోలీసులతో కలిసి ఢిల్లీ పోలీసులు నలుగురు వాంటెడ్ క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే శనివారం తెల్లవారుజామున మెహ్రౌలి ప్రాంతంలో చోటుచేసుకుంది. వాంటెడ్ క్రిమినల్ అయిన కోకు పహాడియా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లారు. ఇది గమనించిన క్రిమినల్ పోలీసులపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు క్రిమినల్ కోకు పహాడియా కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ క్రిమినల్ ను అదుపులోకి తీసుకొని.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు. ఆయుధ సరఫరా తో సహా అనేక కేసుల్లో అతను వాంటెడ్ వ్యక్తిగా ఉన్నాడు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని, నింధితుడి కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.






