తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి : ‘సిటీస్ 2.0’ స్కీంకు ఎంపికైన 18 నగరాలివే..

by Dishanational4 |
తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి : ‘సిటీస్ 2.0’ స్కీంకు ఎంపికైన 18 నగరాలివే..
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బీజేపీకి ఆయువు పట్టుగా నిలుస్తున్న హిందీబెల్ట్‌లోని నగరాలపై వరాల జల్లు కురిపించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టెయిన్ 2.0 (సిటీస్ 2.0) స్కీంకు దేశంలోని 18 నగరాలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో అగర్తల (త్రిపుర), ఆగ్రా (ఉత్తరప్రదేశ్), బరేలీ(యూపీ), బెలగావి(కర్ణాటక), బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), గౌహతి(అసోం), జబల్‌పూర్ (మధ్యప్రదేశ్), జైపూర్(రాజస్థాన్), మధురై(తమిళనాడు), ముజఫర్‌పూర్(బిహార్), న్యూ టౌన్ కోల్‌కతా(బెంగాల్), పనాజీ(గోవా), రాజ్‌కోట్ (గుజరాత్), శ్రీనగర్ (కశ్మీర్), తిరువనంతపురం(కేరళ), తంజావూరు(తమిళనాడు), ఉదయపూర్ (రాజస్థాన్), ఉజ్జయిని(మధ్యప్రదేశ్) నగరాలు ఉన్నాయి. త్రిపుర, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బిహార్, గోవా, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. సిటీస్ 2.0 స్కీమ్‌కు ఎంపికైన మొత్తం 20 నగరాలకుగానూ 12 నగరాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందినవే కావడం గమనార్హం. ఇంతకీ ఈ స్కీమ్ వల్ల ప్రయోజనం ఏమిటంటే.. దీనికి ఎంపికయ్యే నగరాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాల పునర్వినియోగం, రీసైక్లింగ్‌‌, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేస్తుంది. మొత్తం 18 నగరాలకు వచ్చే నాలుగేళ్లలో విడతలవారీగా మొత్తం రూ.1,496 కోట్లను అందిస్తుంది.

Next Story