- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్(Thalapathy Vijay) ర్యాలీలో తొక్కిసలాటలో 33 మంది మృతిచెందినట్లు అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్(Thalapathy Vijay) ర్యాలీలో తొక్కిసలాటలో 33 మంది మృతిచెందినట్లు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. కాగా.. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్ కరూర్ కలెక్టర్‌తో మాట్లాడారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.1లక్ష పరిహారం అందించనున్నట్లు వివరించారు. అటు, రేపు ఆయన కరూర్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.






