- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నీటి నుంచి పోరాటం దాకా..! పానిహతిలో ఆర్‌జి కర్ బాధితురాలి తల్లి ముందంజ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా పానిహతి నియోజకవర్గంలో ఆర్‌జి కర్ బాధితురాలి తల్లి (BJP) ముందంజలో కొనసాగుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా పానిహతి (Panihati) నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. ఆర్‌జి కర్ ఆసుపత్రి అత్యాచార, హత్య ఘటనలో మరణించిన బాధిత యువతి తల్లి రత్న దేబ్‌నాథ్ (Ratna Debnath) ఈ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తూ 2,763 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా, మహిళల భద్రతను ప్రధాన అజెండాగా చేసుకుని ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. బాధితురాలి తల్లికి లభిస్తున్న ఈ ఆధిక్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో బీజేపీ, టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 2011 నుంచి ఇక్కడ టీఎంసీకి చెందిన నిర్మల్ ఘోష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆర్‌జి కర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఎంతటి ఆగ్రహాన్ని కలిగించిందో, అది ఓట్ల రూపంలో ఎలా మారిందో చెప్పడానికి పానిహతి ఫలితం ఓ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






