- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Digital scam: డిజిటల్ అరెస్టు పేరుతో బీజేపీ మాజీ ఎమెల్యేకు మోసం.. 8 రోజుల్లో రూ.30.99 లక్షలు హాంఫట్
డిజిటిలట్ అరెస్టులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే చిక్కుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వినియోగం పెరిగాక మోసాలు కూడా అంతే పెరిగిపోయాయి. రోజుకో కొత్త ఎత్తుగడతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. అనేక మంది అమాయకులతో పాటు సమాజంలో పలుకుపడి ఉన్నవారు కూడా ఈ డిజిటల్ అరెస్టులకు (Digital Arrest) బాధితులుగా మారుతున్నారు. తాజాగా ఈ డిజిటల్ అరెస్ట్ వలయంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే (Former BJP MLA) చిక్కుకున్నారు. ఆయనను బెదిరించి 8 రోజుల్లో రూ. 30.99 లక్షలు కాజేయడం సంచలనంగా మారింది. తీరా తాను మోసపోయానని గ్రహించిన ఆయన సెప్టెంబర్ 6న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎయిర్ లైన్స్ యజమానితో సంబంధాలు ఉన్నాయని..
బీదర్ జిల్లా ఔరాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్ (Gundappa Vakil) గత ఆగస్టు 12 న సీబీఐ అధికారినంటూ గుండప్పకు ఓ వ్యక్తి పోన్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఓ ప్రముఖ ఎయిర్ లైన్ యజమాని ఇంట్లో రెయిడ్స్ చేశామని అతని వద్ద మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఏటీఎం కార్డు దొరికాయని ఏ క్షణమైనా మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు అంటూ భయపెట్టారు. ఆ తర్వాత కాసేపటికి మరో వ్యక్తి ఫోన్ చేసి తాను ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారినంటూ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వ్యక్తిగత, ఆస్తి వివరాలు తీసుకుని మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్పారు. మరునాడు గుండప్పకు వీడియో కాల్ చేసి ఆన్ లైన్ లో నకిలీ కోర్టు సెటప్ లో న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యేను నిర్దోషిగా పేర్కంటూ ఓ ఒప్పందంపై సంతకం చేయాలని కోరారు. అలాగే గుండప్ప వయసు రీత్యా వర్చువల్ దర్యాప్తు నిర్వహిస్తామని సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆర్టీజీఎస్ ద్వారా రూ. 10 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించాడు. ఆ తర్వాత డిజిటల్ అరెస్టు పేరుతో అతడి నుంచి రూ. 30.99 లక్షలు పలు దఫాలుగా కాజేశారు. అయితే ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






