మానవ హక్కుల ఉల్లంఘణలో పాకిస్తాన్ ఛాంపియన్.. భారత విదేశాంగ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
మానవ హక్కుల ఉల్లంఘణలో పాకిస్తాన్ ఛాంపియన్.. భారత విదేశాంగ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు
X

న్యూయార్క్: కశ్మీర్‌పై పదే పదే పాకిస్తాన్ ప్రస్తావన తీసుకొస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ వ్యవహరాల శాఖ ప్రతినిధి జగ్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్, లఢఖ్ ప్రాంతం మొత్తం భారతదేశం లోని విడదీయలేని, అంతర్భాగమని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘణలో పాకిస్తాన్ ఛాంపియన్ అని ఎద్దేవా చేశారు. ఐక్యరాజ్యసమితిలో బుధవారం 52వ రెగ్యులర్ సెషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 17 వ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఅపరేషన్(ఓఐసీ) భారత్‌ను ఉద్దేశించి చేస్తున్న ప్రకటనలు పూర్తి మేము ఖండిస్తున్నాం. ఓఐసీ తన విశ్వసనీయతను కోల్పోయి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంది’ అని చెప్పారు.

ఆధారరహిత ఆరోపణలను భారత్ ఎల్లప్పుడూ ఖండిస్తూనే ఉంటుందని అన్నారు. కశ్మీర్ శాంతి, భద్రత, మహిళ గురించి పాక్ విదేశాంగ మంత్రి బిలవాల్ భుట్టో స్పందించడం పై భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. పాకిస్తాన్ లో దశాబ్దాలుగా వ్యవస్థ లు, సంస్థ లు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే విషయం అక్కడి ప్రజలకు తెలుసని విమర్శంచారు. ముఖ్యంగా బాలోచిస్తాన్, ఖైబర్ పంక్తుక్వా, సింథ్ ప్రావిన్సులోని ప్రజలు రాజకీయాలకు బలవుతున్నారని దుయ్యబట్టారు. ద్వేషపూరిత చట్టాలతో మైనార్టీలను లక్ష్యాలుగా చేసుకున్నారని, కఠిన శిక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘణలో పాకిస్తాన్ ఛాంపియన్ అని ఎద్దేవా చేశారు. ఉన్నత నాయకత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం లో తలమునకలై ఉందని విమర్శలు చేశారు.



Next Story

Most Viewed