వేసవిలో లోడ్ షెడ్డింగ్ లేకుండా చూసుకొండి.. విద్యుత్ శాఖ ఆదేశాలు

by Disha Web Desk 13 |
వేసవిలో లోడ్ షెడ్డింగ్ లేకుండా చూసుకొండి.. విద్యుత్ శాఖ ఆదేశాలు
X

న్యూఢిల్లీ: వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎలాంటి లోడ్ షెడ్డింగ్ లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి డిస్కంలకు సూచించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు చురుకైన చర్యలు తీసుకోవాలి. తాజాగా విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో మంత్రి ఆర్కే సింగ్ సమావేశం నిర్వహించారు. వేసవి నెలల్లో ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని సంబంధిత డిస్కంలను కోరారు.

రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు బొగ్గు కేటాయింపుల్లోనూ పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీని కోరారు. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఈ ఏప్రిల్‌లో 229 గిగా వాట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల సీజన్ దేశంలోని దక్షిణ భాగం నుండి పుంజుకోవడంతో డిమాండ్ తగ్గిపోతుందని తెలిపింది. జీడీపీ 7 శాతానికి చేరుకున్నా ప్రతి ఏటా విద్యుత్ వినియోగం 10 శాతం పెరుగుతున్నట్లు పేర్కొంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ల నిర్వహణను చాలా ముందుగానే చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. గ్యాస్, హైడ్రో ఆధారిత స్టేషన్లకు కూడా సూచనలు చేసింది.

Next Story

Most Viewed