ఎన్నికల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by Dishanational1 |
ఎన్నికల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచనల ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నట్టు మంగళవారం వెల్లడించారు. వచ్చే ఎన్నికల సమయానికి వయసు, ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తనకు 77 ఏళ్లు అని, మరో నాలుగేళ్ల తర్వాత ఎన్నికల సమయానికి ఉత్సాహంగా పనిచేయగల ఉత్సాహం ఉండకపోవచ్చన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సిద్ధరామయ్య.. ఇవి తన చివరి ఎన్నికల అని, అయితే తాను రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. 'వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అడుగుతున్నారు. కానీ తాను ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. వచ్చే ఎన్నికల నాటికి 81 ఏళ్లు వస్తాయి. అప్పటికి ఆరోగ్య సహకరించకపోవచ్చు. ఉత్సాహంగా పనిచేయలేను. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయాల్లో కొనసాగుతానని' వివరించారు. 2028 నాటికి నాకు 82 ఏళ్లు, రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటానని పేర్కొన్నారు. సిద్ధరామయ్య గత కర్ణాటక ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలిచి తొమ్మిదోసారి రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు.

1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా కెరీర్ ప్రారంభించిన సిద్ధరామాయ్య 1983లో రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా వెళ్లారు. చాముండేశ్వరి నుంచి లోక్‌సళ్ పార్టీ టికెట్ ద్వారా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో ఐదుసార్లు గెలుపును, మూడుసార్లు ఓటమిని చూశారు. 2008లో పొరుగునే ఉన్న వరుణ నియోజకవర్గంగా మారిన తర్వాత, 2018లో తన కుమారుడు డాక్టర్ యతీంద్ర కోసం ఆ స్థానాన్ని ఖాళీ చేసి తిరిగి తన పాత నియోజకవర్గం చాముండేశ్వరిలో పోటీ చేశారు. 2023లో, యతీంద్ర తన తండ్రికి తిరిగి వరుణ సీటును ఇచ్చారు.

Next Story

Most Viewed