- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని అధ్యక్షతన CCS అత్యవసర భేటీ షురూ.. దేశ అంతర్గత భద్రతా సన్నద్ధతపైనే చర్చ
ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మంత్రులు నిర్మలా సీతారామన్, జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన రెడ్ ఫోర్ట్ పేలుడు ఘటనపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.
దేశంలో ఉగ్ర కదలికలపై కేంద్ర ఇంటెలిజెన్స్ సమగ్ర సమాచారం ఇవ్వడంతో భద్రతా పరిస్థితులను భేటీలో సమీక్షించనున్నారు. బాంబ్ బ్లాస్ట్‌పై ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఇచ్చిన సమాచారాన్ని అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీకి వివరించనున్నారు. ఉగ్రవాద నిరోధక వ్యూహాలతో పాటు దేశవ్యాప్తంగా అంతర్గత భద్రతా సన్నద్ధతపై కూడా చర్చించనున్నారు. ప్రధాని మోదీ భూటాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన కొద్ది గంటల్లోనే అత్యవసరంగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశాన్ని నిర్వహించడం అత్యంత ప్రధాన్యత నెలకొంది.






