- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షాక్.. రెండోసారి సమన్లు జారీ చేసిన ఈడీ

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ భర్త (Priyanka Gandhi's husband) రాబర్ట్ వాద్రా (Robert Vadra)కు ఈడీ అధికారులు (ED officials) షాక్ ఇచ్చారు. హరియాణాలో భూ ఒప్పందం కేసు (Land contract case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు రెండోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ రాబర్ట్ వాద్రాను మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించడానికి సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసులో మొదటి సమన్లు ఏప్రిల్ 8న జారీ చేశారు. ఆయన స్పందించకపోవడంతో తాజాగా మరోసారి సమన్లు ఇచ్చారు ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హరియాణాలో భూ ఒప్పందాలలో రాబర్ట్ వాద్రా (Robert Vadra)కు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ (Sky Light Hospitality) కి సంబంధించిన ఆర్థిక అవకతవకలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తున్నందున, విచారణ కోసం ED ముందు హాజరు కావాలని ఆయనను కోరారు. ED ప్రకారం, వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుండి రూ.7.5 కోట్లకు గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. తర్వాత, వాద్రా కంపెనీ (Vadra Company) ఆ భూమిని రూ.58 కోట్లకు రియల్ ఎస్టేట్ దిగ్గజం DLFకి విక్రయించింది. ఈ ఆదాయం మనీ లాండరింగ్ (Money laundering) పథకంలో భాగమని అనుమానిస్తూ.. ఆకస్మిక లాభాల వెనుక ఉన్న డబ్బుల వివరాలను ఈడీ అధికారులు (ED officials) పరిశీలిస్తున్నారు.