డా. బీఆర్ అంబేద్కర్ అంతిమయాత్ర.. వైరలవుతోన్న రేర్ వీడియో

by Disha Web Desk 19 |
డా. బీఆర్ అంబేద్కర్ అంతిమయాత్ర.. వైరలవుతోన్న రేర్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్థంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఓ రేర్ వీడియో వైరల్ అవుతోంది. 1956 డిసెంబరు 6న అంబేద్కర్ మహాపరి నిర్వాణం చెందిన వీడియోను షేర్ చేస్తూ.. పేదల కోసం అసమాన కృషి చేసిన మహానీయుడికి పలువురు నివాళులర్పిస్తున్నారు. ఈ వీడియోలో అంబేద్కర్ భౌతికకాయానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మరి కొందరు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అంతేకాకండా అంబేద్కర్ అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొనడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. భారత రాజ్యాంగ నిర్మాతను కడసారి చూసేందుకు లక్షల సంఖ్యలో జనం ఆయన అంతిమయాత్రలో పాల్గొని.. ఆ మహానీయుడికి నివాళులర్పించారు. ఇవాళ అంబేద్కర్ 64వ వర్థంతి సందర్భంగా ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నివాళులు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed