- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థి వీసాలపై గడువు కుదింపు.. కొత్త చట్టాన్ని ప్రతిపాదించిన ట్రంప్ సర్కారు
విద్యార్థి వీసాలపై గడువు కుదించాలని యూఎస్ నిర్ణయించింది. దీనికోసం ట్రంప్ సర్కారు కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లో లీగల్‌గా ఉంటున్న వలసదారులపై కూడా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఫోకస్ పెట్టింది. స్టూడెంట్లు, కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ విజిటర్లు, మీడియా సభ్యులకు ఇచ్చే వీసాల గడువును తగ్గించాలని నిర్ణయించింది. ఇంతకాలం ఎఫ్ వీసాలతో వచ్చే విద్యార్థులు, జె వీసాలతో వచ్చే కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాలు, ఐ వీసాలతో వచ్చే మీడియా సభ్యులు.. ఆయా ప్రోగ్రాంలు, ఉద్యోగాలు ఉన్నంతకాలం యూఎస్‌లో ఉండే అవకాశం ఉండేది. ఈ గడువును తగ్గించేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది.
విద్యార్థి వీసాలకు 4 ఏళ్లు, విదేశీ జర్నలిస్టులకు 240 రోజుల పరిమితి విధించనున్నారు. చైనా నుంచి వచ్చే జర్నలిస్టులకు మాత్రం 90 రోజులు మాత్రమే గడువు పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే సరైన కారణాలు చూపించి ఈ గడువును పొడిగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొందరు ఎప్పటికీ విద్యార్థుల్లాగే ఉండిపోతున్నారని, ఒకదాని తర్వాత ఒక కోర్సు చేస్తున్నారని అధికారులు అంటున్నారు. అందుకోసమే ఈ కొత్త ప్రతిపాదన తెచ్చామన్న యూఎస్.. ఈ ప్రతిపాదనపై 30 రోజుల్లోగా ప్రజాభిప్రాయం అందించాలని కోరింది.
గతంలో తన మొదటి టర్మ్ చివర్లో కూడా ఇలాంటి చట్టం తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. 2020లో తీసుకొచ్చిన ఈ బిల్లుకు చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో 2021లో జో బైడెన్ ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కు తీసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి బిల్లునే ట్రంప్ ప్రభుత్వం తీసుకురావడం గమనార్హం. ఆ తర్వాత హెచ్1బీ వీసాలపై కూడా ట్రంప్ సర్కారు ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కీలక రిపబ్లికన్ నేతలు హెచ్1బీ వ్యవస్థ ఒక స్కాంలా మారిందని, అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొట్టేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులనే ట్రంప్ సర్కారు టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.






