24 గంటల్లో ముగించేస్తా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

by Disha Web Desk 13 |
24 గంటల్లో ముగించేస్తా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
X

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాదిన్నర అయింది. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తాని ట్రంప్ అన్నారు. శాంతి చర్చల ద్వారా ఇది సాధ్యమన్నారు కానీ ఎలాగో మాత్రం చెప్పలేదు. 2024 యుఎస్ అధ్యక్ష ఎన్నికల సమయానికి ఈ యుద్ధం ముగియకపోతే.. తాను తిరిగి ఎన్నికై వైట్ హౌస్‌లో అడుగుపెడితే 24 గంటల్లోపు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో శాంతి చర్చలు చాలా సులువని చెప్పారు.

‘ఒకవేళ పరిష్కారం కాకపోతే 24 గంటల్లో జెలెన్‌స్కీ, పుతిన్‌తో కలిసి పరిష్కరిస్తా. ప్రతి అంశాన్ని చర్చిస్తా. కానీ అదేంటో మాత్రం చెప్పను. ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తే ఆ సమయంలో దాన్ని నేను ఉపయోగించలేను. కానీ చాలా సునాయాసంగా చర్చలు జరపవచ్చు. ఒక్క రోజులో సమస్యను పరిష్కరించి వారి మధ్య శాంతిని నెలకొల్పుతా’ అని ట్రంప్ చెప్పారు. ఏడాదిన్నరగా శాంతి చర్చలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. న్యూక్లియర్ వరల్డ్ వార్ గురించి కూడా ఆయన హెచ్చరించారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే ఈ ఇద్దరి మూర్ఖుల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశముందన్నారు. అణు బాంబులు ఉపయోగించవచ్చని చెప్పారు.



Next Story

Most Viewed