జాతీయ పర్యాటక దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత ఎంటో తెలుసా..

by Disha Web Desk 20 |
జాతీయ పర్యాటక దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత ఎంటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 25 న జరుపుకుంటారు. ఈ రోజు పర్యాటకం, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి పర్యాటకుల దృష్టిని ఆకర్షించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నదులు, పర్వతాలు, బీచ్‌లు, లోయలు, చారిత్రక ప్రదేశాలు, మరెన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు భారతదేశంలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జాతీయ పర్యాటక దినోత్సవం పర్యాటక దినోత్సవం రోజున ట్రావెల్, టూరిజం రంగాలలో పనిచేసే వ్యక్తులను గౌరవిస్తారు.

జాతీయ పర్యాటక దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత..

భారతదేశంలో మొదటి జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1948లో జరుపుకున్నారు. భారతదేశంలో ఆర్థిక వృద్ధిని పెంచడానికి, భారత్ ని అభివృద్ధి చేసి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రోజున దేశంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి దేశంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలో టూరిజం ప్రచారం, అభివృద్ధిని పర్యాటక మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. దేశ ఆర్థికాభివృద్ధికి టూరిజం కీలకం కాబట్టి, కేంద్ర, రాష్ట్ర, ప్రజా స్థాయిలలో పర్యాటకాన్ని మెరుగుపరచడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది.

భారతదేశం పర్యాటక పరిశ్రమ ప్రతి సంవత్సరం ఆర్థిక వ్యవస్థలోకి బిలియన్ల డాలర్లను తీసుకురావడానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి, దేశానికి విదేశీ, స్వదేశీ పర్యాటకుల రాకను పెంచే ఉద్దేశ్యంతో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు.



Next Story