ఫైటర్ జెట్‌ల కోసం హెచ్ఏఎల్‌కు రక్షణ శాఖ రూ. 65 వేల కోట్ల టెండర్‌ జారీ

by Dishanational1 |
ఫైటర్ జెట్‌ల కోసం హెచ్ఏఎల్‌కు రక్షణ శాఖ రూ. 65 వేల కోట్ల టెండర్‌ జారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు కేంద్ర రక్షణ శాఖ భారీ టెండర్‌ను జారీ చేసింది. మేడ్-ఇన్-ఇండియా 97 ఎల్‌సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల కోసం సుమారు రూ. 65,000 కోట్ల ఖరీదైన టెండర్‌ను ఇచ్చింది. దీంతో ఇది స్వదేశీ మిలటరీ హార్డ్‌వేర్ కోసం భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ కావడం గమనార్హం. టెండర్ జారీ చేసిన అనంతరం రక్షణ శాఖ తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ టెండర్‌ను హెచ్ఏఎల్ చేపడితే భారత వైమానిక దళంలోని మిగ్ 21, మిగ్23, మిగ్27 విమానాల స్థానంలో కొత్త ఫైటర్ విమానాలు భర్తీ కానున్నాయి. ఇప్పుడున్న ఫైటర్ విమానాలు దశలవారీగా లేదా సమీప భవిష్యత్తులో తొలగించబడతాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు. హెచ్ఏఎల్ సంస్థను పూర్తిస్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ భారీగా ఆర్డర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంస్థ తయారు చేసిన ఫైటర్ విమానంలో విహరించారు.



Next Story

Most Viewed