అయోధ్యలో మాంసం, మద్యం నిషేధం : సీఎం యోగి

by Dishafeatures2 |
UP CM Yogi Adityanath
X

అయోధ్య : ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో మద్యం, మాంసం వినియోగంపై నిషేధం విధిస్తామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయోధ్య పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఈవిషయాన్ని ఆయన వెల్లడించారు. " అయోధ్య ధర్మనాగ్రి (మతపరమైన నగరం) కాబట్టి ప్రజల మనోభావాలను అందరూ గౌరవించాలి. ఇందులో భాగంగా ఈ నగరంలో మాంసం, మద్యం వినియోగాన్ని నిషేధించాలి" అని యోగి చెప్పారు.

ఈసందర్భంగా అయోధ్యలో కొనసాగుతున్న రామమందిర నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అయోధ్యను మోడల్ సిటీగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దార్శనికత మేరకు అయోధ్య సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు. అభివృద్ధిచెందిన అయోధ్యను చూడటానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు, పర్యాటకుడు ప్రత్యేక సంతృప్తి, శాంతి, ఆనందంతో తిరిగి వెళ్లేలా నిర్మాణాలను తీర్చి దిద్దాలని సూచించారు.



Next Story