రాజ్యాంగాన్ని వలసవాదులు ప్రసాదించలేదు : సీజేఐ

by Dishanational2 |
రాజ్యాంగాన్ని వలసవాదులు ప్రసాదించలేదు : సీజేఐ
X

ముంబై: భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజ్యాంగం స్వపరిపాలన, గౌరవం, స్వాతంత్రాలతో కూడుకున్న అద్భుతమైన దేశీయ ఉత్పత్తి అని అన్నారు. అయితే కొందరు దీనిపై హేళన చేస్తుండగా, మరికొందరు దీని విజయంపై విరక్తి చెందుతున్నారని విమర్శించారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జాతీయ న్యాయ కళాశాల తొలి స్నాతకోత్సవ వేడుకల్లో శనివారం ఆయన మాట్లాడారు. భారత వలసవాదులు మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించలేదని అన్నారు. రాజ్యాంగాన్ని ఆవిర్భవించిన సందర్భం నుంచి చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. రాజ్యాంగం విపరీతమైన పురోగతి సాధించినప్పటికీ, ఇంకా చాలా సాధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో ఉన్న లోతైన అసమానత నేటికీ కొనసాగుతోందని సీజేఐ అన్నారు. న్యాయ విద్యార్థులు రాజ్యాంగ విలువలను నిర్దేశించుకుంటే భవిష్యతులో వారికి వైఫల్యం ఉండదని చెప్పారు. రాజ్యాంగ విజయం అనేది రెండు కోణాల్లో ఉంటుందని.. కొందరు దాని విజయం గురించి మాట్లాడితే.. మరి కొందరు దానిపై ద్వేషాన్ని వెల్లగక్కుతారని తెలిపారు. రాజ్యాంగ సృష్టికర్తనుద్దేశించి మాట్లాడుతూ.. మనకు అందించిన రాజ్యాంగ హక్కులు, పరిష్కారాల విషయంలో అంబేడ్కర్‌కు రుణపడి ఉన్నామని చెప్పారు.

Also Read..

కర్ణాటక జీఎస్టీ వసూళ్లు రూ.6,085 కోట్లు



Next Story

Most Viewed