తీవ్ర ఉత్కంఠకు తెరదించిన AICC.. తల్లి ఇలాకా నుండి బరిలోకి రాహుల్ గాంధీ

by Disha Web Desk 19 |
తీవ్ర ఉత్కంఠకు తెరదించిన AICC.. తల్లి ఇలాకా నుండి బరిలోకి రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కంచుకోటలైనా రాయ్‌బరేలి, ఆమేథి పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు ఎవరన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు శుక్రవారం ఏఐసీసీ అధికారికంగా ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలి నుండి పోటీకి దిగనున్నట్లు ఏఐసీసీ వెల్లడించింది. ఆమేథి లోక్ సభ స్థానం నుండి కిషోర్ లాల్ శర్మ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైన రాయ్‌బరేలి, ఆమేథి లోక్ సభ స్థానాలపై హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో కాంగ్రెస్ కంచుకోటలైనా ఈ రెండు స్థానాల నుండి ఎవరూ బరిలోకి దిగుతారని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలి నుండి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేసి విజయం సాధించగా.. ఆమేథి నుండి రాహుల్ గాంధీ బరిలోకి దిగి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన సోనియా గాంధీ.. రాజస్థాన్ నుండి రాజ్య సభకు వెళ్లారు. గతంలో ఆమేథిలో ఓటమితో ఈ సారి రాహుల్ గాంధీ తన సిట్టింగ్ స్థానమైనా వయనాడ్ నుండి మాత్రమే బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. దీంతో రాయ్ బరేలి, ఆమేథి స్థానాల అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. ఆమేథి నుండి ప్రియాంక గాంధీ లేదా ఆమె భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని సైతం వార్తలు వినిపించాయి.

అయితే, ఏఐసీసీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రాహుల్ గాంధీని తన సిట్టింగ్ స్థానమైన ఆమేథి నుండి కాకుండా.. తల్లి సోనియా సొంత ఇలాకా రాయ్‌బరేలి నుండి బరిలోకి దించింది. నామినేషన్ దాఖలకు చివరి రోజు వరకు కాంగ్రెస్ ప్రేస్టేజ్ సీట్లపై సస్పెన్స్ కంటిన్యూ చేసిన ఏఐసీసీ మరి కొన్ని గంటల్లో నామినేషన్ల దాఖలకు టైమ్ ముగుస్తుందనగా క్యాండిడేట్ల పేర్లను అనౌన్స్ చేయడం గమనార్హం. ఇక, రాయ్ బరేలి, ఆమేథి లోక్ స్థానాలకు ఈ నెల 20న ఐదో దశలో ఎన్నికలు జరగనున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed