- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్కోలో కారుబాంబు దాడి.. ఆర్మీ జనరల్ మృతి
by Muthe.Rajitha |
రష్యా రాజధాని మాస్కోలో సోమవారం కారు బాంబు పేలుడు జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రష్యా రాజధాని మాస్కోలో సోమవారం కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో కీలక లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. సర్వరోవ్ సాయుధ దళాల ఆపరేషనల్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ అధిపతి ఉన్నారు. కాగా నేడు ఆయన అపార్ట్‌మెంట్ సమీపంలో కారు పార్కింగ్ చేసి ఉండగా... ఆ వాహనం కింద అమర్చిన పేలుడు పరికరం పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉండొచ్చని రష్యా అధికారులు అనుమానిస్తూ దర్యాప్తు చేపట్టారు. 2022 నుంచి కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న తరుణంలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపింది.
Next Story






