కెనడాలో హిందుఫోబియా ఆందోళనకరం

by Dishanational2 |
కెనడాలో హిందుఫోబియా ఆందోళనకరం
X

ఒట్టావా: కెనడాలో హిందు ఆలయాలపై జరిగిన దాడులకు భారత సంతితికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య విచారం వ్యక్తం చేశారు. హిందువులను వ్యతిరేకిస్తూ ఆలయాలపై జరుగుతున్న దాడులు తనను బాధిస్తున్నాయన్నారు. హిందుఫోబియా(హిందువలంటే వ్యతిరేకత) పెరగడం తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పారు. పార్లమెంటులో జరిగిన సమావేశాల్లో విద్వేషా నేరాల అంశాలను లేవనెత్తిన ఆయన దాడులను ఖండించారు. కెనడాలో పెరుగుతున్న హిందు వ్యతిరేకతపై హిందు కెనడియన్లను తీవ్రంగా బాధిస్తోంది' అని తాను మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు. ఇలాంటి దాడులు ప్రమాద ఘంటికలు మోగిస్తాయని చెప్పారు. హిందు వ్యతిరేక విద్వేష నేరాలను ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. హిందుఫోబియా భౌతిక దాడులకు దిగే అస్కారం ఉందని పేర్కొన్నారు. హిందు, భారత వ్యతిరేక గ్రూపులు మంగళవారం కెనడాలోని బ్రాంప్టన్‌లోని గౌరి శంకర్ మందిర్‌పై దాడులకు పాల్పడ్డాయి. మరోవైపు కెనడాలోని భారత్ దౌత్య కార్యాలయం ఈ దాడులను ఖండించింది.


Next Story

Most Viewed