- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kerala: కేరళలో మిస్టరీ మరణాలు..
కేరళ(Kerala)లో మిస్టరీ మరణాలు సంచలనంగా మారాయి. కేంద్రప్రభుత్వంలో ఉన్నతహోదాలో ఉన్న అధికారి మనీశ్ విజయ్ ఇంట్లో ముగ్గురు చనిపోవడం కలకలంగా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ(Kerala)లో మిస్టరీ మరణాలు సంచలనంగా మారాయి. కేంద్రప్రభుత్వంలో ఉన్నతహోదాలో ఉన్న అధికారి మనీశ్ విజయ్ ఇంట్లో ముగ్గురు చనిపోవడం కలకలంగా మారింది. మనీశ్ విజయ్ కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ విభాగంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆఫీసుకు నాలుగు రోజులు సెలవులు పెట్టారు. అవి పూర్తయిన తర్వాత కూడా ఆయన తిరిగి విధుల్లోకి రాలేదు. దాంతో మనీశ్‌ను కలిసేందుకు స్నేహితులు ఎర్నాకుళం జిల్లాలోని అతని క్వార్టర్స్‌కు వెళ్లి చూశారు. కానీ అక్కడికి వెళ్లగానే దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తీయగా మనీశ్ ఒక గదిలో, ఆయన సోదరి షాలిని మరో గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. వారి తల్లి వేరే గదిలో మంచంపై నిర్జీవంగా కనిపించింది. ఆ మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి పూలు చల్లినట్లుగా ఉంది. ఆమె డెడ్ బాడీ పక్కనే వీరు ముగ్గురూ దిగిన ఫొటో ఉంది. దీంతో ఈ ఘటన అనుమానాలకు దారితీసింది. ఆమె ముందే చనిపోయి ఉండొచ్చని, లేకపోతే ముందే చంపేసి, వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
కొచ్చిలో అధికారులు
కొద్దిరోజుల క్రితమే వారు మృతి చెందినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. అయితే, ఫొరెన్సిక్ పరీక్ష తర్వాతే మృతుకి గల కారణం ఏంటో తెలుస్తుందన్నారు. అలాగే వారి గదిలో డైరీని గుర్తించారు. విదేశాల్లో ఉన్న సోదరికి తమ మరణం గురించి సమాచారం ఇవ్వాలని, ఇంట్లో ఉన్న అన్ని పత్రాలను ఆమెకు అందించాలని అందులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే, జార్ఖండ్ కు చెందిన మనీశ్ గతంలో కోజికోడ్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ విభాగానికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. కొద్దినెలల నుంచి ఆయనతో పాటు తల్లి, సోదరి కూడా ఉంటున్నారు. ఇక షాలిని ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకు సాధించింది. అయితే, పరీక్షల్లో జరిగిన అవకతవకల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. దీంతోనే, ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మనీశ్ సెలవు పెట్టింది కూడా లీగల్ పనిపైనే అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.






