మమతా బెనర్జీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత.. మీ రేటెంత అంటూ!

by Anjali |
మమతా బెనర్జీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత.. మీ రేటెంత అంటూ!
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై తమ్లూక్ బీజేపీ నేత, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభిజిత్ ‘సందేశ్‌ఖాలీ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రను రూ. 2000 కు కొనుగోలు చేశామని తృణమూల్ అంటుందన్నారు. మరీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీరు ఎంతకు అమ్ముడుపోతున్నారని ప్రశ్నించారు. మీ రేటెంత? రూ. 10 లక్షలా? అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ్ వ్యాఖ్యలపై టీఎంసీ నేత శాంతాను సేన్ స్పందించారు. బీజేపీ పాలనలో మహిళలను ఈ విధంగా అనుమానించడం సరైందా? అని ఆయన హద్దులు మీరారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే మమతా బెనర్జీపై అభిజిత్ గంగోపాధ్యాయ కామెంట్స్ చేయలేదని ఫేక్ వీడియో అంటూ బీజేపీ కప్పిపుచ్చుతోంది.

Next Story